ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నటి మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. ఇండిగో సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించిన ఆమె.. తనకు ఎదురైన ఇబ్బందులను పేర్కొన్నారు. ఆ సంస్థకు చెందిన సిబ్బంది తనతో చాలా దురుసుగా ప్రవర్తించాని ఎక్స్ వేదిగా పేర్కొన్నారు. పోస్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేశారు. తన లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారని, బ్యాగ్ తెరవడానికి కూడా అనుమతించలేదని చెప్పారు. వాళ్లు చెప్పినట్టు చేయకపోతే గోవాలోనే తన లగేజ్‌ను వదిలేస్తామని చెప్పారని, సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఎక్స్ వేదికగా మంచు లక్ష్మీ చెప్పారు.
ఇదొక రకమైన వేధింపు అని, తన కళ్ల ముందే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదన్నారు. ఒక వేళ ఏదైనా వస్తువు మిస్ అయితే ఇండిగో బాధ్యత తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు అని ఇండిగోను ప్రశ్నించారు. ఇకపై తాను ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని తెలిపారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాగా మంచు లక్ష్మీ చేసిన పోస్టుపై ఇండిగో ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.