ఇండియా నెంబర్-1 హీరో ప్రభాస్.. ఆ తర్వాత ఎవరంటే..

రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజాగా మరో ఘనతను సాధించాడు.

By Srikanth Gundamalla  Published on  22 July 2024 9:45 AM IST
india, number one hero, prabhas, ormax list,

ఇండియా నెంబర్-1 హీరో ప్రభాస్.. ఆ తర్వాత ఎవరంటే..

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉంది. కలెక్షన్లలో రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. అయితే.. రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజాగా మరో ఘనతను సాధించాడు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మక్స్‌ మోస్ట్‌ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్‌ మొదటి స్థానంలో నిలిచారు. జూన్‌ నెలకు సంబంధించి దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపురల్ స్టార్ల జాబితాను ఆర్మాక్స్‌ విడుదల చేయగా.. అగ్ర స్థానంలో ప్రభాస్ ఉన్నారు.

మే నెలలో టాప్‌లో ఉన్న ప్రభాస్‌ జూన్‌లో కూడా తన స్థానాని నిలబెట్టుకున్నారు. ఇక రెండో స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్ ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. టాలీవుడ్‌ మోస్ట్‌ పాపులర్ హీరో రామ్‌చరణ్‌ ఈ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో అలియా భట్‌ మొదటిలో ఉండగా.. సమంత, దీపికా పదుకొణె తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు సృష్టిస్తోంది. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ‘బుక్‌మైషో’లో షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ (Jawan) రికార్డును అధిగమించింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇండియాలో ఇంకా ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. విదేశాల్లో అయితే హౌస్‌ ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది.

Next Story