కేజీఎఫ్ చాఫ్టర్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్
Inayat khalil poster out.కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కెన చిత్రం కేజీఎఫ్ చిత్రం ఎంతటి
By తోట వంశీ కుమార్ Published on 31 May 2021 12:11 PM ISTకన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కెన చిత్రం 'కేజీఎఫ్' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2018లో బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించింది.' కేజీఎఫ్'కు సీక్వెల్‌గా చాప్టర్ 2 రూపొందుతుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించినప్పటికి కరోనా నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.
Wishing our #InayathKhalil, @BalaTheKrishna a very Happy Birthday.#KGFChapter2. pic.twitter.com/qPjvhhHBU9
— Hombale Films (@hombalefilms) May 31, 2021
ఇందులో రాఖీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'కేజీఎఫ్ 2' విడుదల కానుంది. కాగా.. నేడు ఇనాయత్ ఖలీల్ క్యారెక్టర్‌ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్‌ను పేపర్ కట్టింగ్ రూపంలో విడుదల చేశారు. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్ ఖలీల్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ చిత్ర బృందం పేర్కొంది. దుబాయ్‌లో ఉంటూ ఇండియాపై కన్నేసే గోల్డ్ స్మగ్లర్ల డాన్‌గా ఇనాయత్ ఖలీల్ రోల్ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.