IMDB ర్యాంకింగ్స్‌.. మాస్ట‌ర్‌కి తొలిస్థానం.. వ‌కీల్ సాబ్ ఎంతంటే..?

IMDb releases list of 10 most popular titles of 2021.బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు మరియు ప్రాంతీయ భాష చిత్రాల రేటింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2021 11:02 AM IST
IMDB ర్యాంకింగ్స్‌.. మాస్ట‌ర్‌కి తొలిస్థానం.. వ‌కీల్ సాబ్ ఎంతంటే..?

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు మరియు ప్రాంతీయ భాష చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ శాతం మంది ఐఎండీబీ(ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌) ను ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఐఎండీబీ లో టాప్ రేటెడ్ మూవీస్ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఎండీబీ లో యూజర్లు రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వారి అభిప్రాయం మేరకు రేటింగ్ ఇస్తూ ఉంటారు. టాప్ చిత్రాలను అందులోని రేటింగ్ ను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు. తాజాగా 2021లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన టాప్‌-10 చిత్రాలు, వెబ్‌సిరీస్ ల ప‌ట్టిక‌ను ఐఎండీబీ విడుద‌ల చేసింది.

ఇందులో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్ సినిమా 9వ స్థానం దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెర‌కెక్కిన మాస్ట‌ర్ చిత్రం రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్,ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్,అర్జున్ దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు.

Next Story