నటి ఆమనికి అస్వస్థత
Illness to Senior actress Aamani.ప్రముఖ సినీ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.సినిమా షూటింగ్‌లో పాల్గొన్న
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2021 1:31 PM ISTప్రముఖ సినీ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమని అస్వస్థతకు గురి కావడంతో.. వెంటనే ఆమెనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె.. సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల పట్టణంలో జరుగుతోంది.
మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. ఆమని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమనిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈచిత్ర షూటింగ్ మంచిర్యాల జిల్లాలో జరుగుతోంది. అయితే.. షూటింగ్‌లో ఆమె అస్వస్థతకు గురికాగా.. వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. స్వలంగా ఛాతినొప్పి వచ్చిందని.. భయపడాల్సిన పని లేదన్నారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. అనంతరం షూటింగ్ స్పాట్‌కు వెళ్లి షూటింగ్‌లో పాల్గొన్నారు.
మరోవైపు ఆమె మెయిన్ లీడ్‌లో నటిస్తున్న 'అమ్మదీవెన' నేడు విడుదల కానుంది. 'జంబలకిడి పంబ' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమని.. 'మిస్టర్ పెళ్లాం', 'శుభలగ్నం', 'సిసింద్రి', 'ఘరానాబుల్లోడు', 'ఆనలుగురు' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.