డబ్బు ఉంటే పిల్లల పేరు మీద డిపాజిట్‌ చేయండి..సినిమాలపై పెట్టకండి: విశాల్

ఒక సినిమా తీయాలంటే కనీసం రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అదే డబ్బును మీ పిల్లల పేరు మీద పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. లేదంటే, భూమి కొనుగోలు చేయండి.

By Knakam Karthik  Published on  30 Jan 2025 4:03 PM IST
Cinema News, Entertainment, Actor Vishal, Chennai,

డబ్బు ఉంటే పిల్లల పేరు మీద డిపాజిట్‌ చేయండి..సినిమాలపై పెట్టకండి: విశాల్

మ‌ద గ‌జ రాజా సినిమా విజ‌యం సాధించడంతో విశాల్ చెన్నైలోని క‌ప‌లీశ్వ‌ర‌ర్ టెంపుల్‌ని సంద‌ర్శించారు. ఆలయ దర్శనం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన దర్శనానికి గల కారణాలను వెల్లడించారు. సినిమా విజయవంతమైతే మొక్కు తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే గుడికి వచ్చానని తెలిపారు.

విశాల్ తమిళ సినిమాకు ఎదురైనా నష్టం గురించి కూడా మాట్లాడారు. “డబ్బు ఉన్నవాళ్లు ఎవరైనా సినిమాలు నిర్మించగలరు. విజయ్ మాల్యా లేదా అంబానీ లాంటి వారు ఎందుకు అందులోకి రాలేకపోతున్నారు? ఎందుకంటే చిత్ర పరిశ్రమలో నష్టాలు ఎక్కువ. ఈ విషయం వాళ్లకు బాగా తెలుసు. మొదట్లో నేను ఈ మాట చెబితే నన్ను విలన్‌గా చూసేవాళ్లు. ప్రస్తుతం సినిమాల నిర్మాణం కష్టతరంగా మారింది. తమిళ సినిమా నిర్మాణం సవాళ్లతో కూడుకున్నది. పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడంలో విఫలమయ్యాము" అని విశాల్ అన్నారు. ఒక సినిమా తీయాలంటే కనీసం రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అదే డబ్బును మీ పిల్లల పేరు మీద పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. లేదంటే, భూమి కొనుగోలు చేయండి. ఇండస్ట్రీలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవని విశాల్ చెప్పారు.

Next Story