'ఆర్ఆర్ఆర్' మూవీ ఎలా ఉంది భ‌య్యా.. టిక్కెట్లు దొర‌కడం లేదు..!

If that happened would be watching RRR today. తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2021 6:18 AM GMT
RRR Movie

తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఒక‌టి. ద‌ర్శ‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో తెలియ‌ని ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలియా భ‌ట్‌- ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాలం కలిసొచ్చి.. అన్నీ అనుకున్న‌ట్లు జరిగితే.. రాజ‌మౌ‌ళీ చెప్పిన‌ట్లుగా .. నేడు ఈ సినిమాను చూస్తుండేవాళ్లం.


గ‌తేడాది ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని 2021 జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ ప్ర‌చార చిత్రం ద్వారా చెప్పాడు. కానీ కరోనా పుణ్యాన స్టార్ట్‌ కెమెరా యాక్షన్‌కు బదులుగా పాజ్‌(ఆగు), కెమెరా, క్లోజ్‌ అన్నట్లుగా తయారైంది. దీంతో ఈ ప్యాన్‌ ఇండియా చిత్రీకరణ మరింత ఆలస్యమైంది. క‌రోనా కార‌ణంగా అనుకున్న‌ట్లుగా సినిమా షూటింగ్‌ను పూర్తిచేయ‌లేక‌పోయారు. దీనిపై నెటీజ‌న్లు ఫ‌న్నీగా స్పందిస్తున్నారు. థియేటర్స్ లో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లున్నట్లు.. రివ్యూలు ఇస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజు థియేటర్ల ముందు సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉండేవని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు 2021 అంటే 2031 అన్నమాట ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో #RRRMovie హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.ఏదేమైనా 'ఆర్.ఆర్.ఆర్' కోసం సినీ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందని టాక్ నడుస్తోంది.

Advertisement


Next Story
Share it