అల్లు అర్జున్ న్యూలుక్.. గుర్తుప‌ట్ట‌లేక‌పోయాను అన్న ర‌ష్మిక‌

Icon Star Allu Arjun new look goes viral.పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశ,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2022 12:37 PM IST
అల్లు అర్జున్ న్యూలుక్.. గుర్తుప‌ట్ట‌లేక‌పోయాను అన్న ర‌ష్మిక‌

'పుష్ప' చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశ, విదేశాల్లోని ప్రేక్ష‌కులు బ‌న్ని న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం అంద‌రూ 'పుష్ప 2 'చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. ఇక బ‌న్ని క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ప‌లు వాణిజ్య సంస్థ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌ న్యూ లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్‌, చెవికి పోగు పెట్టి రఫ్‌లో లుక్‌లో కనిపించాడు బన్ని. అయితే ఇది సినిమా కోసం కాదండోయ్‌. ఓ యాడ్ షూటింగ్ కోసం బ‌న్ని ఇలా త‌యారైయ్యాడు. ఇటీవ‌ల బ‌న్నీ-హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో హైద‌రాబాద్‌లో ఓ యాడ్ షూట్ జ‌రిగింది. ఈ యాడ్ కోసం బ‌న్ని ఇలా క‌నిపించాడు. ఈ ఫోటోను బ‌న్ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయ‌గా.. క్ష‌ణాల్లో అది వైర‌ల్‌గా మారింది. లైకులు, రీట్వీట్లతో సోషల్‌ మీడియాని హోరెత్తిస్తున్నారు.

స‌డెన్‌గా చూసి బ‌న్నీని గుర్తుప‌ట్ట‌లేక‌పోయామ‌ని ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. ఇక న‌టి ర‌ష్మిక మందాన సైతం 'ఓ మై గాడ్‌.. అల్లు అర్జున్ స‌ర్‌.. ఒక్క క్ష‌ణం పాటు మిమ్మ‌ల్ని గుర్తుప‌ట్ట‌లేక‌పోయాను' అంటూ పోస్టు చేసింది.


Next Story