పుష్ప థ్యాంక్స్ మీట్‌.. స్టేజీపైనే క‌న్నీళ్లు పెట్టుకున్న అల్లుఅర్జున్‌, సుకుమార్‌

Icon Star Allu Arjun gets Emotional in Pushpa Thank You Meet.సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2021 5:01 PM IST
పుష్ప థ్యాంక్స్ మీట్‌.. స్టేజీపైనే క‌న్నీళ్లు పెట్టుకున్న అల్లుఅర్జున్‌, సుకుమార్‌

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం 'పుష్ప‌'. డిసెంబ‌ర్ 17న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం హైద‌రాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. 'సుకుమార్ లేకుంటే నేను లేను.. సుకుమార్ పరిచయం కాకుంటే… 'ఆర్య 'చిత్రాన్ని చేయకుండా ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేదని' అంటూ భావోద్వేగానికి గురి కాగా.. అక్క‌డే ఉన్న‌సుకుమార్ కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు.

తాను సినిమాలు చేద్ద‌మ‌నుకున్న‌ప్పుడు ఆ సమయంలో సుకుమార్ చిత్రం కాకుండా ఇంకో చిత్రం చేసుంటే తన జీవితం వేరే విధంగా ఉండేదని, 'ఆర్య' చిత్రం చేయడంతో తన కెరీర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ వరకు ఎదిగిందని అల్లుఅర్జున్ చెప్పారు. నా జీవితంలో చాలా తక్కువమందికి మాత్రమే రుణపడి ఉన్న అని పదం వాడుతా.. నా తల్లిదండ్రులు.. మా తాతగారికి.. నాకు అండగా నిలిచినా చిరంజీవిగారికి ఆతర్వాత సుకుమార్ కు అని చెప్పారు. 'డార్లింగ్ నువ్వు లేక‌పోతే నేను లేను. ఆర్య లేదు ఇంకేమీ లేదు' అంటూ అంటూ బ‌న్నీ చెప్పుకొచ్చాడు. ఈ మాట‌లు చెబుతున్న సంద‌ర్భంలో బ‌న్నీ బావోద్వేగానికి గురై క‌న్నీళ్లు పెట్టుకోగా.. ఆ మాట‌లు వింటున్న ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా రెండు చేతుల్లో ముఖం దాచుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ చేసి యావ‌త్ భార‌త‌దేశం చూసేలా చేశారంటే నా కెరీర్‌కు సుకుమార్ ఎంత కంట్రిబ్యూష‌న్ ఇచ్చారో మాట్ల‌ల్లో చెప్ప‌లేనని అల్లు అర్జున్ అన్నారు.

'పుష్ప' చిత్రం కోసం సేక‌రించిన విష‌యాల‌తో స‌మ‌గ్ర పుస‌క్తం రాస్తాన‌ని సుకుమార్ చెప్పారు. 'పుష్ప‌-2' చిత్రం త‌రువాత పుష్ప వెబ్ సిరీస్ చేయనున్న‌ట్లు తెలిపారు. 'ఆర్య' సినిమా నుంచి రంగ టీమ్ తన సినిమాలకు పనిచేస్తున్నారని చెప్పారు. కొన్ని సార్లు 24 గంట‌లు ప‌నిచేయాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ వారు నిద్ర‌పోకుండా ప‌ని చేస్తుంటారు. త‌మ కోసం, త‌మ సినిమా కోసం అంత‌లా క‌ష్ట‌ప‌డిన కిందిస్థాయి టెక్నీషియ‌న్స్ ఒక్కొక్క‌రికీ రూ.ల‌క్ష ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సుకుమార్.

Next Story