ఫ్యాన్స్‌మీట్‌లో అభిమానులకు గాయాలు.. ఎమోషనల్ ట్వీట్ పెట్టిన బన్ని
Icon star Allu Arjun Emotional Tweet Viral.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2021 9:02 AM ISTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇక సోమవారం సాయంత్రం ఫ్యాన్ మీట్ పోగ్రాం పేరిట బన్ని తన అభిమానులను కలిసి మాట్లాడేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కి భారీగా అభిమానులు తరలి వచ్చారు.
అంచనాలకు మించి అభిమానులు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు విధించారు. ఫొటో సెషన్ రద్దు అయ్యిందంటూ సమాధానం రావడంతో అభిమానులు ఊగిపోయారు. కోపంతో ఊగిపోయిన అభిమానులు కన్వెన్షన్ సెంటర్ గేటు విరగగొట్టడం, బారికేడ్లను తొలగించడం, అద్దాలు పగలగొట్టడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారి లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కొంతమంది అల్లుఅర్జున్ అభిమానులు గాయపడ్డారు.
— Allu Arjun (@alluarjun) December 13, 2021
ఈ ఘటనపై రాత్రి సోషల్ మీడియా వేదికగా బన్ని స్పందించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ మీట్ ఈ వెంట్‌లో పలువురు అభిమానులకు గాయాలు అయ్యాయని తెలిసింది. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని నాకు చేరవేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటాను. మీ ప్రేమ, అభిమానం నాకు కోట్ల ఆస్తి. దాన్ని ఎప్పుడూ మరిచిపోను అంటూ బన్ని ట్వీట్ చేశారు.