అక్క‌డ ఏం లేదు..? మ‌ధ్య‌లో మీగోల ఏంటి..?

Icon star Allu Arjun and his wife cute video viral on social media.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న భార్య స్నేహారెడ్డితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Aug 2022 8:59 AM IST
అక్క‌డ ఏం లేదు..?  మ‌ధ్య‌లో మీగోల ఏంటి..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న భార్య స్నేహారెడ్డితో క‌లిసి ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు. 'ఇండియా డే ప‌రేడ్ న్యూయార్క్‌-2022' కార్యక్ర‌మానికి ఈ యేడాది గ్రాండ్ మార్ష‌ల్ హోదాలో భార‌త‌దేశం నుంచి అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ ప‌రేడులో వారితో పాటు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ సైతం పాల్గొన్నాడు. అయితే.. క‌వాతులో జ‌రిగిన ఓ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అల్లుఅర్జున్ అంద‌రిని ప‌ల‌క‌రిస్తూ ఉండ‌గా.. యాదృచ్చికంగా మిస్ యూనివ‌ర్స్ 2021 హ‌ర్నాజ్ సంధూ సైతం అక్క‌డికి వ‌చ్చింది. బన్ని ని చూడ‌గానే హ‌ర్నాజ్ హాయ్ అంటూ ప‌ల‌క‌రించ‌గా.. బ‌న్ని సైతం మ‌ర్యాద‌పూర్వ‌కంగా న‌వ్వుతూ ప‌ల‌క‌రించాడు. ఆ దృశ్యాన్ని చూసిన బ‌న్ని భార్య స్నేహ ముభావంగా ముఖం తిప్పుకుని నిల‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

వాస్త‌వానికి నిజంగా స్నేహ అలిగిందో లేదో తెలీదు కానీ.. కొంద‌రు నెటీజ‌న్లు మాత్రం ఆమె లుక్‌ను పోసిసివ్ నెస్ లుక్ అని వారే క‌న్ఫ‌ర్మ్ చేశారు. భార్య ప‌క్క‌న ఉండ‌గా ఏంటి ఆ పనులు అని కొంద‌రు కామెంట్లు పెడుతుండ‌గా వారు అక్క‌డ ఏమీ లేదు..? మీ కామెంట్లు ఆపాలంటూ మ‌రికొంద‌రు కామెంట్లు పెట్టారు. అక్క‌డ ఏమీ లేదు.. మ‌ర్యాద‌పూర్వ‌కంగానే వారిద్ద‌రూ మాట్లాడుకున్నారు దీన్ని పెద్ద ఇష్యూ చేయ‌కండి అంటూ చెబుతున్నారు.

కాగా.. గ‌తంలో జెనీలియా భ‌ర్త రితేష్ దేశ్ ముఖ్‌, ప్రీతి జింటాను కౌగిలించుకుని మాట్లాడుతుంటే జెనీలియా ఇచ్చిన రియాక్ష‌న్స్ ఎంత‌గా వైర‌ల్ అయ్యాయో చెప్పాల్సిన ప‌ని లేదు.

Next Story