ప్ర‌భాస్ షేర్ చేసిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' టీజర్

IchataVahanumulu Niluparadu​ Teaser.అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2021 5:01 AM GMT
IchataVahanumulu Niluparadu​ Teaser

అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'. 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్‌. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా కొత్త ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. సుశాంత్ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి న‌టిస్తోంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి,నటుడు హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

'నా లైఫ్ లో అమ్మకి అమ్మాయికి బైక్ కి అవినాభావ సంబంధం ఉంది..' అంటూ.. సుశాంత్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. తనకు ఎంతో ఇష్టమైన బైక్ వ‌ల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ప‌్రేమించిన అమ్మాయి మ‌న‌సుని ఎలా గెలుచుకున్నాడు..? అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. వెన్న‌ల కిషోర్ కామెడీతో అల‌రించ‌గా.. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ వైర‌ల్ అవుతోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
Next Story
Share it