యూజర్లకు షాకిచ్చిన ఐ బొమ్మ.. మొన్న అలా.. ఇప్పుడు ఇలా
IBomma that shocked Indian users. సినీ అభిమానులకు 'ఐ బొమ్మ' గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓటీటీ, థియేటర్లలో రిలీజ్
By అంజి Published on 19 Aug 2022 6:23 AM GMTసినీ అభిమానులకు 'ఐ బొమ్మ' గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓటీటీ, థియేటర్లలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలను హైక్వాలిటీతో ఫ్రీగా 'ఐ బొమ్మ' అందిస్తోంది. చాలా మంది ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తమకు నచ్చిన సినిమాలను చూస్తుంటారు. అయితే కొన్ని రోజుల కిందట 'ఐ బొమ్మ'ను నడపడం కష్టంగా ఉందని, తమ మీద దుష్ప్రచారం వస్తుండటంతో వెబ్‌సైట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఆ తర్వాత వెబ్‌సైట్‌ను మూసివేసే విషయంలో వెనక్కి తగ్గింది.
కాగా 'ఐ బొమ్మ' మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా ఓటీటీలో రిలీజైన సినిమాలు అన్ని 'ఐ బొమ్మ'లో ఉండేవి. సెర్చ్ ఆప్షన్‌లోకి వెళ్లి.. మరీ మనకు నచ్చిన సినిమాలు ఆన్‌లైన్‌లో లేదా డౌన్‌లోడ్ చేసుకుని చూసే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు భారత యూజర్లు కేవలం వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడొచ్చని వెబ్‌సైట్ హోమ్ పేజీలో 'ఐ బొమ్మ' ప్రకటించింది. అయితే ఇది కూడా టెంపరరీగా అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే పూర్తి సినిమాలను చూసే విధంగా ఎప్పటి నుంచి మళ్ళీ అవకాశం కల్పిస్తారన్న విషయంపై మాత్రం 'ఐ బొమ్మ' ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఐ బొమ్మలో సెర్చ్ ఆప్షన్ ఉండేది. సెర్చ్ ఆప్షన్ ఉండడంతో ఆయా సినిమాలో పేర్లతో సెర్చ్ చేసుకుని సినిమాలు చూసే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సెర్చ్ ఆప్షన్ కూడా కనిపించకుండా డిసేబుల్ చేశారు. 'ఐ బొమ్మ'పై వస్తున్న ప్రచారాలపై.. వెబ్‌సైట్ వారు నేరుగా క్లారిటీ ఇస్తే సినీ అభిమానులకు పూర్తి అవగాహన వచ్చే కనిపిస్తుంది.