ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో 'గే' లు ఉన్నారు.. అనసూయ షాకింగ్ సమాధానం
మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో చాలా మంది గే లున్నారు. అయితే పర్సనల్‌గా నాకు లెస్బియన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కాలేదు
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 7:38 AM GMTజబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై సత్తా చాటిన అనసూయ వెండితెర పైన హవా కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్క్ కు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది.
తాజాగా అనసూయ ఆన్‌లైన్‌లో అభిమానులతో చాటింగ్ చేసింది. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. కాగా.. ఓ నెటిజన్ ఆమెకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా లెస్బియన్స్, గేల గురించి చాలా తెలివిగా ప్రశ్నించగా.. అనసూయ కూడా చాలా ఓపెన్‌గానే సమాధానం చెప్పింది. అనసూయ చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
"మీరు నిజంగా మెట్య్చుూర్డ్, లిబరల్ ఉమెన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు లెస్బియన్స్‌తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా?" అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఇలా సమాధానం చెప్పింది. "మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో చాలా మంది గే లున్నారు. అయితే పర్సనల్‌గా నాకు లెస్బియన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కాలేదు. కానీ ఆన్ లైన్ మాత్రం చాలా సార్లు ఆ అనుభవాన్ని ఫేస్ చేశాను." అని చాలా డేరింగ్, ఓపెన్‌గా సమాధానం చెప్పింది. మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ ఎప్పుడు చేస్తారు అని మరో నెటీజన్ అడుగగా.. 'టీర్‌పీల కోసం మేకర్లు చేస్తే అవమానకర స్టంట్స్ పోతేకాని నేను రాను. నేను కూడా బుల్లితెరను మిస్ అవుతున్నాను' అని అంది.
ఇటీవల విడుదలైన సందీప్ కిషన్ చిత్రం 'మైఖేల్'లో అనసూయ భరద్వాజ్ చివరిసారిగా తెరపై కనిపించింది. 'పుష్ప2'తో పాటు కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగ మార్తాండసలో చిత్రాల్లో అనసూయ కీలక పాత్రల్లో నటిస్తోంది.