ఆ జిల్లా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాన‌న్న ఆది.. డేట్ ఫిక్స్‌..!

Hyper Aadi marriage date fix.హైప‌ర్ ఆది పెళ్లి డేట్, వధువు ఎవరనే విషయాన్ని కూడా చెప్పి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 10:09 AM GMT
Hyper Aadi

జ‌బ‌ర్ద‌స్త్‌లో స్ర్కిప్ట్ రైట‌ర్‌గా కెరీర్ ప్రారంభి టీమ్ లీడ‌ర్‌గా ఎదిగాడు హైప‌ర్ ఆది. త‌న‌దైన పంచుల‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తున్నాడు. కొంత మంది హైప‌ర్ ఆది స్కిట్ల కోస‌మే జ‌బ‌ర్ద‌స్త్ చూస్తారంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇక 'ఢీ' షో తో అత‌డు మ‌రో ఎత్తుకు ఎదిగాడ‌నే చెప్పుకోవ‌చ్చు. యువ‌త‌లో ఆదికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక‌ప్పుడు కామెడీతో వార్త‌ల్లో నిలిచిన ఆది.. కొన్నాళ్లుగా ఎఫైర్స్‌తో వార్త‌ల్లో నిలిచాడు. ఆ మ‌ధ్య అన‌సూయ‌తో చ‌నువుడ‌ని వార్త‌లు రాగా.. ఇటీవ‌ల యాంక‌ర్ వ‌ర్షిణితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌నే పుకార్లు వినిపించాయి.

ఇక పెళ్లి టాఫిక్ ఎప్పుడు వ‌చ్చినా.. తన కంటే ముందు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ లు పెళ్లిళ్లు చేసుకున్న త‌రువాత‌నే తాను పెళ్లి చేసుకుంటాన‌ని ప‌లు వీడియోల్లో ఆది చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే.. వారు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్పుడు ఆది వివాహానికి సిద్దమైన‌ట్లు తెలుస్తోంది. ఆది కోసం ఓ మంచి అమ్మాయిని వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట అత‌డి త‌ల్లిదండ్రులు. అత‌డు కూడా త‌ల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాన‌ని చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే పెళ్లి డేట్, వధువు ఎవరనే విషయాన్ని కూడా చెప్పి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమ పెళ్లి అవుతుందని, అది కూడా తమ సొంత జిల్లా ప్రకాశంకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు ఆది చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రీ ఈ పెళ్లి వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగ‌కత‌ప్ప‌దు.


Next Story