అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
Hyderabad Traffic Police Shock to Tollywood Celebrities.సినీ నటులు అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు తెలంగాణ ట్రాఫిక్
By తోట వంశీ కుమార్ Published on 27 March 2022 8:15 AM GMT
సినీ నటులు అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు. వారి కార్లకు ఉన్న బ్లాక్స్ స్క్రీన్‌ను తొలగించిన పోలీసులు జరిమానా విధించారు.
శనివారం ఉదయం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్ రోడ్ నంబరు 36లోని నీరూస్ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వెలుతున్న అల్లు అర్జున్ కారు ఆపారు. ఆ కారుకు ఉన్న నల్ల తెరలను తొలగించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ.700 జరిమానా విధించారు. అదే దారిలో వెలుతున్న మరో నటుడు కళ్యాణ్ రామ్ కారును ఆపి జరిమానా విధించారు. హీరోల వాహనాలకు మాత్రమే కాదు. నిబంధనలు పాటించని 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.
వై- క్యాటగిరి, జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ వంటి భద్రత ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్లాక్ స్క్రీన్ ఉపయోగించే అవకాశం ఉంది. వారి వాహనాలకు మినహా ఇతరులెవరూ బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప-2' చిత్రంతో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ 'బింబిసార' చిత్రంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది.