మంచు మ‌నోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. రూ.700 జ‌రిమానా

Hyderabad Traffic police fined Actor Manchu Manoj.నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు త‌మ‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 5:23 AM GMT
మంచు మ‌నోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. రూ.700 జ‌రిమానా

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు త‌మ‌కు ఎవ‌రైనా ఒక‌టేన‌ని అంటున్నారు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్‌కు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. హైద‌రాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో మంచు మ‌నోజ్ కారు(ఏపీ 39HY 0319) ను ఆపారు. మంచు మ‌నోజ్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండ‌డంతో దాన్ని తొల‌గించారు. నిబంధ‌న‌లు ఉల్లంగించినందుకు రూ.700 జ‌రిమానా విధించారు. కాగా.. ఆ స‌మ‌యంలో కారులో మంచు మ‌నోజ్ ఉన్నారు. ఆయ‌న పోలీసుల విధి నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించార‌ని పోలీసులు తెలిపారు.

కాగా.. వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు త‌నిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్ రామ్ కార్ల‌కు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ల‌ను తొల‌గించ‌డంతో వారికి జ‌రిమానా విధించిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it