హంట్ ట్రైల‌ర్‌.. యాక్ష‌న్‌+స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్

Hunt Movie Official Trailer out now.వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుల్లో హీరో సుధీర్ బాబు ఒక‌రు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2023 12:48 PM IST
హంట్ ట్రైల‌ర్‌.. యాక్ష‌న్‌+స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుల్లో హీరో సుధీర్ బాబు ఒక‌రు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'హంట్‌'. మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదగా విడుద‌లైన ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. మొత్తంగా యాక్షన్ సీక్వెన్స్ లు నెక్ట్ లెవెల్ అని చెప్పాలి. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సుధీర్ బాబు, యాక్ష‌న్ టీమ్ ప‌డిన క‌ష్టం క‌నిపిస్తోంది. న‌టుడు శ్రీకాంత్‌, ప్రేమిస్తే ఫేం భ‌రత్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Next Story