షాకింగ్ గా మారిన ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్

హృతిక్ రోషన్-దీపిక పదుకోన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫైటర్

By Medi Samrat  Published on  24 Jan 2024 8:48 AM GMT
షాకింగ్ గా మారిన ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్

హృతిక్ రోషన్-దీపిక పదుకోన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'ఫైటర్'. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్ వర్గాలకు షాక్ ఇస్తున్నారు. హృతిక్ రోషన్ తాజా చిత్రం ఫైటర్ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్ కు షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది పఠాన్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. అయినా కూడా బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. ట్రైలర్ పెద్దగా బజ్ ఇవ్వలేదని కూడా తెలుస్తోంది.

భారీ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజున 40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా 2వ రోజు పబ్లిక్ హాలిడే అయినందున భారీ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫైటర్‌కి సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్ లను చూస్తుంటే మొదటి రోజు 20కోట్ల కంటే తక్కువ కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు. జాతీయ మల్టీప్లెక్స్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా ఉంది. ఇక ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అంతలోపు అడ్వాన్స్ బుకింగ్స్ తీరు మారుతాయేమో చూడాలి. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం భారీ కలెక్షన్స్ తప్పకుండా సొంతం చేసుకునే సత్తా ఈ సినిమాకు ఉంది.


Next Story