చిరు కోసం హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌..!

Hollywood pop sensation Britney Spears to croon for Godfather.రీఎంట్రీ త‌రువాత చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 11:20 AM IST
చిరు కోసం హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌..!

రీఎంట్రీ త‌రువాత చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన మెగాస్టార్.. మోహన్‌ రాజాతో గాడ్‌ ఫాదర్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంకర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాద‌ర్ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ వ‌రుస‌గా వ‌స్తున్నాయి.

ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే.. ఈ చిత్రంలోని ఓ పాట‌ను హాలీవుడ్ పాప్ సింగ‌ర్ చేత పాడించేందుకు థ‌మ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. బ్రిట్నీ స్పియర్ చేత పాడించాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని టాక్‌. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ఆమెతో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గాడ్‌ ఫాదర్‌ మేకర్స్‌ ఆమెకు భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. నిజంగా బ్రిట్ని స్పియ‌ర్‌తో పాట పాడించ‌నున్నారా..? లేక ఇది పుకారుగానే మిగిలిపోతుందా అన్న‌ది చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు తెలీదు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో బ్రిట్నీ పాట పాడింది.

Next Story