రాజమౌళి-మహేశ్ మూవీ నుంచి బిగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది.
By అంజి Published on 24 Aug 2023 12:57 PM ISTరాజమౌళి-మహేశ్ మూవీ నుంచి బిగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అలాగే రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా.. ఇంటర్వ్యూల్లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెబుతూ భారీ బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మరో విషయాన్ని చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. మహేష్ ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్ నటులు కూడా ఉంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే జాగా మహేష్, రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉందని, అయితే వారిని తాము ఇంకా సంప్రదించలేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అంతకు మించి ఎక్కువ ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
తాజాగా రాజమౌళి తండ్రి చేసిన ఈ కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలుగిస్తున్నాయి. ఈ సినిమాపై అభిమానులు మరిన్ని అంచనాలు పెంచేసుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా.. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. గతంలో ఇదే సినిమాపై దర్శకుడు రాజమౌళ్లి మాట్లాడుతూ.. గత 10 ఏళ్ల నుంచి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోందని చెప్పారు. గ్లోబల్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను మేకింగ్ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాలో మహేష్ రోల్ హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని రాసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే పవర్ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక.. రాజమౌళి సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.