ఆద్యంతం ఉత్కంఠభరితంగా 'హిట్‌-2' ట్రైల‌ర్

HIT 2 Trailer Out Now.టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ న‌టిస్తున్న తాజా చిత్రం హిట్‌-2.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2022 6:58 AM GMT
ఆద్యంతం ఉత్కంఠభరితంగా హిట్‌-2 ట్రైల‌ర్

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'హిట్‌-2.' శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌. నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 2 న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా బుధ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. "ఈ క్రిమినల్స్ అంతా తెలివిలేని వాళ్ళు, కోడి బుర్రలు, 5 నిముషాలు చాలు వీళ్ళని పట్టుకోడానికి" అంటూ నేరస్థులను కృష్ణ దేవ్ ఎగతాళి చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఓ అమ్మాయి హ‌త్య కేసు కిల్లర్ ని పట్టుకునే క్రమంలో కృష్ణ దేవ్ ఊహించని విషయాలను కనుగొంటున్నాడు. అమ్మాయిల‌ను హింసించి చంపించిన ఆ హంతకుడు ఎవ‌రు..? అత‌డిని దేవ్ ప‌ట్టుకున్నాడా.? వంటి అంశాల‌తో తెర‌కెక్కిన క్రైమ్ థిల్ల‌ర్ ఇది. రావు ర‌మేష్‌, శ్రీనాథ్‌ మాగంటి, కోమ‌లి ప్రసాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story