దర్శకుడు రాంగోపాల్ వర్మకు షోకాజ్ నోటీసులు
High Court Issue Show cause noteice Director Ramgopal Varma .. వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు
By సుభాష్ Published on 24 Nov 2020 3:23 PM ISTవివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్‌నోటీసలు జారీ చేసింది. దిశ ఎన్‌కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న 'దిశ ఎన్‌కౌంటర్' చిత్రాన్ని నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిచారు. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకుగురవుతున్నాయని, ఇలాంటి సమయంలో వర్మ ఈ సినిమా నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని పిటిషనర్ తరపున న్యాయవాది కృష్ణమూర్తి హైకోర్టుకు వివరించారు.
ఈ సినిమాలో వారిని దోషులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడిషయల్ కమిషన్ విచారణ జరుగుతున్న తరుణంలో సినిమా ఎలా తీస్తారని కోర్టుకు తెలిపారు. వెంటనే సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టకు విన్నవించారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ కార్యాలయం హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
కాగా, మరో వైపు దిశ ఎన్‌కౌంటర్ సినిమా ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 26న షాద్‌నగర్ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచారం ఆధారంగా 'దిశ ఎన్‌కౌంటర్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇప్పటికే యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. మరి తాజాగా హైకోర్టు నోటీసులతో వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.