గుండెలను పిండేసేలా.. 'హాయ్.. నాన్న' ట్రైలర్.!

న్యాచురల్‌ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

By Medi Samrat  Published on  24 Nov 2023 8:24 PM IST
గుండెలను పిండేసేలా.. హాయ్.. నాన్న ట్రైలర్.!

న్యాచురల్‌ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. నాని తన కుమార్తె కియారాకు ఒక కథ చెబుతున్నట్టుగా ట్రైలర్ మొదలైంది. కియారా తన తల్లి గురించి చెప్ప‌మ‌ని నానిని అడుగుతుంది.. నాని కియారాని తల్లిలా పక్కనే ఉన్న మృణాల్‌ను ఊహించుకోని తన లవ్ స్టోరీని చెబుతాడు. ఆ తర్వాత గొడవలు పడి భార్యతో నాని విడిపోయినట్టుగా ఈ ట్రైలర్‌లో ఉంది. నాని భార్య ఎవరు? ఆమెకు ఏమైంది? నాని తన భార్యకు సంబంధించిన రహస్యాన్ని కూతురికి ఎందుకు దాచిపెట్టాడు? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే!!


డిసెంబ‌ర్ 07న సినిమా విడుదల కాబోతోంది. తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌ కన్నీళ్లు పెట్టించడం పక్కా అని అర్థం అయిపోతోంది ట్రైలర్ చూడగానే. హాయ్‌ నాన్నలో బేబీ కియారా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనుండ‌గా.. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story