మహాసముద్రం : 'హే రంభా రంభా' లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

Hey Rambha Rambha lyrical song out.యంగ్‌హీరో శ‌ర్వానంద్ బొమ్మ‌రిల్లు ఫేమ్ సిద్దార్థ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 11:27 AM IST
మహాసముద్రం : హే రంభా రంభా లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

యంగ్‌హీరో శ‌ర్వానంద్ బొమ్మ‌రిల్లు ఫేమ్ సిద్దార్థ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'మ‌హాస‌ముద్రం'. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుద్దిద్దుకుంటున్న ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌డు. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు మంచి స్పంద‌న తెచ్చుకోగా.. శుక్ర‌వారం 'హే రంభా 'అనే ఫ‌స్ట్ రిలిక‌ల్ సాంగ్‌ను వీడియోను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

దీనికి చైతన్య భరద్వాజ్ ట్యూన్ కంపోజ్ చేయడమే కాకుండా స్వయంగా ఆలపించారు. 'ఓ రంభా రంభా హే రంభా హే రంభా.. ఎక్కదే గుడుంబా..' అంటూ లిరిసిస్ట్ భాస్కరభట్ల దీనికి సాహిత్యం అందించారు. జాతర నేపథ్యంలో వైజాగ్ బీచ్ లో చిత్రీకరించిన ఈ పాటలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రంభ ఫ్లెక్సీలు కటౌట్లు కనిపిస్తున్నాయి. ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈచిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story