ఎన్నో రిజెక్ట్ చేశా.. ఇది మాత్రం చాలా స్పెషల్: శ్రీలీల

పుష్ప పార్ట్ 1 లో 'ఊ అంటావా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By అంజి  Published on  28 Nov 2024 9:23 AM IST
Heroine Srileela, special song, Pushpa-2

ఎన్నో రిజెక్ట్ చేశా.. ఇది మాత్రం చాలా స్పెషల్: శ్రీలీల 

పుష్ప పార్ట్ 1 లో 'ఊ అంటావా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప పార్ట్ 2లో కూడా అలాంటి స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి చిందేసింది.

తన కొత్త చిత్రం 'రాబిన్‌హుడ్' సినిమా కోసం ఇటీవల విలేకరుల సమావేశంలో శ్రీలీల తాను ఎందుకు స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేశానో తన నిర్ణయాన్ని వివరించింది. ఇది సాధారణ ఐటెమ్ సాంగ్ కాదని, దాని వెనుక బలమైన కారణం ఉందని తెలిపింది. సినిమా విడుదలయ్యాక ఆ విషయం మీకు తెలుస్తుందని శ్రీలీల చెప్పుకొచ్చింది. పలు స్పెషల్ సాంగ్స్ కోసం అడిగారని, వాటిని రిజెక్ట్ చేసినట్లు కూడా శ్రీలీల తెలిపింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన కిస్సిక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్, డిసెంబర్ 5, 2024 న విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్‌తో సహా స్టార్-స్టడెడ్ తారాగణం ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా సాగుతున్నాయి.

Next Story