యాక్టింగ్‌లో తనకు రోల్ మోడల్ ఎవరో చెప్పిన సమంత
అల్లు అర్జున్‌పై హీరోయిన్ సమంత కూడా ప్రశంసలు కురిపించారు.
By Srikanth Gundamalla Published on 5 March 2024 2:15 PM ISTయాక్టింగ్‌లో తనకు రోల్ మోడల్ ఎవరో చెప్పిన సమంత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ పాన్ ఇండియాకు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. పార్ట్-1 విజయవంతం కావడంతో.. రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే.. పుష్ప సినిమాలో ఆయన యాక్టింగ్ స్కిల్స్‌కు ఇండియానే కాదు.. వరల్డ్ మొత్తం ఫిదా అయిపోయింది. అల్లు అర్జున్ పుష్పలోని పాటలు, డైలాగ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో రీల్స్ చేసిన వారున్నారు. తాజాగా అల్లు అర్జున్‌పై హీరోయిన్ సమంత కూడా ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల హీరోయిన్ సమంత ఓ కాలేజీ ఫెస్ట్‌లో పాల్గొంది. అక్కడ స్టూడెంట్స్‌తో కాసేపు మాట్లాడింది. దాంతో.. విద్యార్థులు సామ్‌ను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. యాక్టింగ్‌లో స్ఫూర్తి ఎవరు అంటూ ఒక స్టూడెంట్ అడగ్గా.. దానికి సామ్ అల్లు అర్జున్ పేరు చెప్పింది. యాక్టింగ్‌లో తనకు అల్లు అర్జున్ స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది. తనతో కలిసి మరో సినిమా చేయాలని ఉందంటూ పేర్కొంది. ఎందుకంటే యాక్టింగ్ బీస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అల్లు అర్జున్ అని సమంత చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో కూడా సమంత ఇదే విషయాన్ని చెప్పింది.
అల్లు అర్జున్, సమంత కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప సినిమాలో కూడా సమంత కనిపించింది. స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అదిరిపోయే డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఊ ఉంటావా పాట పాన్ ఇండియా స్థాయిలో ఒక ఊపు ఊపేసింది. సామ్ తన రోల్ మోడల్ హీరోగా అల్లు అర్జున్ పేరు చెప్పడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Samantha says Icon star @alluarjun is my acting role model ⭐@Samanthaprabhu2 pic.twitter.com/D6bDzuf5G9
— 🄹🄺 (@kaali_102) March 4, 2024