హీరోయిన్ రంభకు యాక్సిడెంట్.. ఆస్ప‌త్రిలో కూతురు

Heroine Rambha Family met car Accident.అల‌నాటి స్టార్ హీరోయిన్ రంభకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 10:02 AM IST
హీరోయిన్ రంభకు యాక్సిడెంట్.. ఆస్ప‌త్రిలో కూతురు

అల‌నాటి స్టార్ హీరోయిన్ రంభకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. రంభ ఫ్యామిలీ ప్ర‌యాణీస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో రంభ ప్యామిలీకి గాయాల‌య్యాయి. అయితే.. అవ‌న్నీ చిన్న గాయాలేన‌ని తెలుస్తోంది. అయితే.. ఆమె కూతురు సాషా మాత్రం ఆస్ప‌త్రిలో బెడ్డుపై ఉంది. ఈ విష‌యాన్ని రంభ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

ఆమె సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. త‌న పిల్ల‌ల‌ను స్కూల్ నుంచి పికప్ చేసుకుని కారులో ఇంటికి వ‌స్తుండ‌గా ఇంకో కారు అనుకోకుండా వీరి కారును ఢీ కొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో రంభ‌, ఆమె పిల్ల‌ల‌తో పాటు వారి బాధ్య‌త‌లు చూసుకునే ఓ ఆయా ఉన్నారు. "దేవుడి ద‌య వ‌ల్ల ఈ ప్ర‌మాదం నుంచి అంద‌రూ చిన్న చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అంద‌రం సుర‌క్షితంగానే ఉన్నాం. కాకాపోతే చిన్నారి సాషా ఇంకా ఆస్ప‌త్రిలోనే ఉంది. తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి.. మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు.. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్.. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి" అంటూ రంభ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


ఈ విష‌యం తెలుసుకున్న రంభ అభిమానులు, ప‌లువురు సినీ సెల‌బ్రెటీలు.. చిన్నారి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. "మీరేం బాధపడకండి.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. మీకోసం నేను ప్రార్థిస్తాను" అని పాయల్ రాజ్‌పుత్ తెలిపింది.

Next Story