బెదిరింపులను ఎదుర్కొంటున్న పాయల్ రాజ్ పుత్.. అందుకే తిడుతున్నారు

టాలీవుడ్ కు చెందిన కొందరు నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని నటి పాయల్ రాజ్ పుత్ ఆరోపించారు.

By M.S.R  Published on  20 May 2024 2:30 PM IST
payal Rajput,  tollywood, producers ,

బెదిరింపులను ఎదుర్కొంటున్న పాయల్ రాజ్ పుత్.. అందుకే తిడుతున్నారు

టాలీవుడ్ కు చెందిన కొందరు నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని నటి పాయల్ రాజ్ పుత్ ఆరోపించారు. తాను ఓ సినిమాలో నటించానని.. అయితే ఆ సినిమాకు సంబంధించి తనకు అందించాల్సిన పేమెంట్ ను ఇవ్వలేదని పాయల్ తెలిపింది. అంతేకాకుండా తాను ప్రమోషన్స్ కు హాజరవ్వకపోవడంతో తనను తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. తాను ఎటువంటి తప్పూ చేయలేదని.. అయినా కూడా తన మీద నిందలు వేస్తూ ఉండడంతో లీగల్ గా పోరాడడానికి తన టీమ్ తో సిద్ధమైనట్లు పాయల్ తెలిపింది.

ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ద్వారా పాయల్ రాజ్ పుత్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే కొందరు చిత్ర నిర్మాతల నుండి తనకు ఎదురైన వేధింపుల గురించి బయట పెట్టింది. పాయల్ రాజ్‌పుత్ రక్షణ అనే చిత్రంలో నటించింది.. అది త్వరలో విడుదల కానుంది. 2019- 2020లో చిత్రీకరించిన ఈ సినిమాకు మొదట్లో 5Ws అని పేరు పెట్టారు. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదల అవుతోందని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమెకు ఉన్న పాపులారిటీని సద్వినియోగం చేసుకోవాలనే ఆశతో నిర్మాతలు తన బకాయిలను క్లియర్ చేయకుండా తనను ప్రమోషన్స్ కు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. చెల్లింపులను పరిష్కరించడం, పరిహారం అందించడంపై చర్చలు జరపడానికి ఆమె బృందం ప్రయత్నాలు చేసినప్పటికీ, నిర్మాతలు అందుకు నిరాకరించారు. అంతేకాకుండా ఆమె పేరును దుర్వినియోగం చేసి, ఆమె ప్రతిష్టను దిగజార్చారు.. ఆమెను తెలుగు సినిమా నుంచి బహిష్కరిస్తామంటూ బెదిరించారని పాయల్ తెలిపింది. చెల్లింపు సమస్యలు పరిష్కారం కాని కారణంగా ఆమె అనుమతి లేదా సమ్మతి లేకుండా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారని.. తాను చట్టపరమైన చర్యలను తీసుకోవాలని అనుకుంటూ ఉన్నానని పాయల్ తెలిపింది. పాయల్ ఆరోపణలపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story