పెళ్లైన 4 నెలలకే.. కవలలకు తల్లయిన నయనతార

Heroine Nayanthara gave birth to twins through surrogacy. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇద్దరు మగబిడ్డలకు తల్లి అయ్యింది. నయనతారకు సరోగసీ ద్వారా కవలలు కలిగారు.

By అంజి
Published on : 10 Oct 2022 8:34 AM IST

పెళ్లైన 4 నెలలకే.. కవలలకు తల్లయిన నయనతార

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇద్దరు మగబిడ్డలకు తల్లి అయ్యింది. నయనతారకు సరోగసీ ద్వారా కవలలు కలిగారు. ఈ విషయాన్ని నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. తమ కుమారుల పేర్లను ఉయిర్, ఉలగమ్ అని పేర్కొన్నారు. నయనతార, తాను అమ్మానాన్నలమయ్యాయని విఘ్నేశ్ శివన్ తెలిపారు. కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో ఉజ్వలంగా, మనోహరంగా ఉన్నట్టు అనిపిస్తోందని తెలిపారు. దేవుడు డబుల్ గ్రేట్ అంటూ కొనియాడారు.

తమ ప్రార్థనలు, పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచే జరిగిందని చెప్పారు. విఘ్నేష్ వారి నవజాత శిశువుల చిన్న పాదాలను ముద్దాడిన రెండు అందమైన ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఆయ‌న పోస్ట్ క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే పెళ్లైన 4 నెలల‌కే పిల్లలు పుట్టడం ఏంటంటూ అభిమానులు, నెటిజ‌న్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

చాలాకాలంగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లితో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. చివరిసారిగా నయనతార చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్‌'లో కనిపించింది. మరోవైపు విఘ్నేష్ శివన్ తదుపరి అజిత్ 62వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు.

Next Story