టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం వేళ హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. ''నిన్న నేను కారులో వెళ్తుంటే అలా.. మరో కారు నా కారుని తాకుతూ వెళ్లింది. నా కారు మీద బాగానే స్క్రాచెస్ పడ్డాయి. కానీ ఆ కారు వాళ్ళు ఆపలేదు. స్లో చేయలేదు నాకెందుకో ఇది “పెద్దవాళ్ళు “ నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది. నా ఫాలోవర్స్ నా సాక్షం, నా బలం'' అంటూ మాధవీలత ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. కాగా తనను చంపాలంటే చంపొచ్చని ఇటీవల మాధవీలత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
''ఒక ఆడబిడ్డని నోటికొచ్చిన బూతు మాటలు మాట్లాడి తర్వాత క్షమాపణ విసిరేసి బతికేస్తున్నారు. ఈ దేశంలో చట్టం గట్టిగా పని చేస్తే ఇంకెప్పుడు ఎవరు నాయకులు మాటలు జారరు , నా దేశం అతి పెద్ద రాజ్యాంగం అమలుచేయడంలో చాలా వెనకబాటులో ఉంది. ఎన్నో మహిళా చట్టాలు పుస్తకాలలో మాత్రమే ఉన్నాయి. అవి పెద్దవాళ్ళకి ఒకలా పేదవాళ్లకి మరోలా కాకుండా సరిగ్గా పనిచేసేలా చేస్తే మరెప్పుడు ఇంకెవరు నోరు జారరు కదా? ప్రపంచ పెద్ద దేశాల చట్టాలన్నీ ఎత్తుకొచ్చి మారి రాసుకున్న రాజ్యాంగం పెద్ద దేశాలలో అమలులో ఉంది మనదేశం లో ఎందుకు లేదు? రాయకీయ నాయకులకి ఒక న్యాయం సాధారణ ప్రజలకి మరో న్యాయం ఎందుకు?'' అని మాధవీ లత ప్రశ్నించారు.