హీరోయిన్‌కు షాక్.. 2 గంటల 42 నిమిషాల సినిమాలో ఒక్క ప్రేమ్‌లో కనిపించలే
Heroine Disappointed By Vikram’s Mahaan.సాధారణంగా సినిమాల్లో హీరో, హీరోయిన్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2022 11:04 AM ISTసాధారణంగా సినిమాల్లో హీరో, హీరోయిన్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారి కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెలుతుంటారు. అన్ని చిత్రాల్లోనూ హీరోయిన్లకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు దక్కనప్పటికి పాటలు, రొమాంటిక్ సన్నివేశాల్లోనైనా కనిపిస్తుంటారు. అయితే.. ఇక్కడ ఓ హీరోయిన్ కు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది. ఓ పెద్ద చిత్రంలో నటించినప్పటికి ఒక్కటంటే.. ఒక్క ప్రేమ్‌లోనూ అమ్మడు కనిపించలేదు. దాదాపు 2 గంటల 42 నిమిషాల నిడివి గల సినిమాలో ఒక్క సెకన్ కూడా హీరోయిన్ కనిపించకపోవడంతో ఆమె అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అని అంటారా..? ఆమె వాణీ భోజన్.
చియాన్ విక్రమ్ నటించిన చిత్రం 'మహాన్'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సిమ్రాన్ కూడా కీలక పాత్రలో కనిపించింది. అయితే.. సినిమాలో భాగమైన హీరోయిన్ వాణీ భోజన్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. ఇది ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సినిమా విడుదలకు ముందు తమిళ చలనచిత్ర, టెలివిజన్ నటి అయిన వాణీ భోజన్ ను ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో తీసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించి.. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం విడుదల చేసింది.
అయితే.. ఏమీ జరిగిందో తెలీదు కానీ.. సినిమా విడుదల అయ్యాక.. ఒక్క సెకన్ కూడా ఆమె తెరపై కనిపించలేదు. ఆమె పాత్రను సినిమా నుంచి తొలగించారు. సినిమా నిడివి ఎక్కువ కావడమే అందుకు కారణమని కొందరు అంటున్నారు. ఇప్పటికే సినిమా నిడివి 2గంటల 42 నిమిషాలు ఉందని.. వాణీ పాత్ర కూడా ఉంటే మూడు గంటలు దాటే అవకాశం ఉండడంతో ఆమెను పాత్రను తొలగించారని అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ చిత్రబృందం తీసుకున్న నిర్ణయం వాణీ భోజన్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంపై అమ్మడు భారీగానే ఆశలు పెట్టుకోగా.. అవన్నీ అడియాశయే అయ్యాయి.