కిలిమంజారోను అధిరోహించిన నివేదా థామ‌స్‌

Heroin Nivetha Thomas, kilimanjaro Mount.జెంటిల్‌మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేధా థామస్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2021 10:59 AM GMT
కిలిమంజారోను అధిరోహించిన నివేదా థామ‌స్‌

'జెంటిల్‌మెన్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేధా థామస్. తన అందం, నటనతో ప్రేక్ష‌కుల మ‌న‌సును దోచుకుంది. అనంత‌రం 'నిన్ను కోరి', 'జై లవకుశ', 'బ్రోచేవారెవరురా' చిత్రాల‌తో పుల్ బిజీగా మారిపోయింది. ఇటీవ‌లే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో పల్లవి పాత్రలో అదరగొట్టేసింది. అటు తమిళంలోనూ రజనీకాంత్ 'దర్బార్' తో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే.. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయలేని సాహసాన్ని చేసి ఔరా అనిపించింది. శిఖరాగ్రంపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను అంటూ రాసుకొచ్చింది అమ్మ‌డు. ఇక నివేదాకు చిన్న‌ప్ప‌టి నుంచి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. కిలిమంజారో ప‌ర్వ‌తంపై ట్రెక్కింగ్ కోసం ఆరు నెల‌ల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంది. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో ప‌ర్వ‌తంపై ట్రెక్కింగ్ ఎంతో సాహ‌సోపేతంతో కూడుకున్న‌ది.

మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఒకటి. మావెన్జీ, షిరా, కీబో.. అనే మూడు అతి ఎత్తయిన పర్వత శిఖరాలను కలిగి ఉంటుంది. ఇందులో మావెన్జీ ఎత్తు-5,149 మీటర్లు. షిరా హైట్-3,962 మీటర్లు. కాగా అత్యంత ఎత్తయినది కీబో. దీని ఎత్తు 5,885 మీటర్లు. కీబో శిఖరంలోని ఉహురు పీక్ ఇంకో 10 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. సముద్రమట్టం నుంచి 5,895 మీటర్ల ఎత్తున ఉంటుంది ఉహూరు పీక్. ఈ పర్వత శిఖరాగ్రంపై క్షణక్షణానికి వాతావరణం మారుపోతుంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలులను ఎదుర్కొని నిల్చోవాల్సి ఉంటుంది.

Next Story