త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో విశ్వక్‌సేన్!

సోషల్‌ మీడియాలో హీరో విశ్వక్‌ సేన్ ఓ పోస్టు పెట్టాడు. అది పెళ్లి అప్‌డేట్‌ అని తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 9:30 PM IST
Vishwak Sen, Marriage, Tollywood,

 త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో విశ్వక్‌సేన్!

టాలీవుడ్‌లో భాజాభజంత్రీలు మోగుతున్నాయి. యంగ్‌ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. శర్వానంద్‌ ఏడు అడుగులు వేయగా.. వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది. ఏడు అడుగులు వేసేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ కూడా పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. వరుస సినిమాల్లో ఫుల్‌ బిజీగా ఉన్న విశ్వక్‌ తాజాగా ఓ పోస్టు పెట్టాడు. దాన్ని చూస్తుంటే పెళ్లి అప్‌డేట్‌ ఇచ్చేసినట్లు అర్థం అవుతోంది.

హీరో విశ్వక్‌సేన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెడుతూ ఇలా రాసుకొచ్చాడు. ఇన్నాళ్ల నుంచి నాపై ప్రేమ చూపించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నాడు. ఇక ఇప్పుడు మీ అందరితో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. తన జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నానని.. కుటుంబాన్ని మొదలు పెట్టబోతున్నానని తెలిపాడు విశ్వక్‌సేన్. ఆగస్టు 15న పూర్తి వివరాలు తెలియచేస్తానని పేర్కొన్నాడు. దాంతో.. విశ్వక్‌ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ అది పెళ్లి గురించే అంటూ చర్చించుకుంటున్నారు. అయితే.. విశ్వక్‌సేన్‌ పెళ్లాడబోయే ఆ వధువు ఎవరో తెలియాలంటే మాత్రం ఆగస్టు 15 వరకు వేచి చూడాలి.

కాగా.. విశ్వక్‌ నటిస్తున్న గామి షూటింగ్‌ పూర్తి అయ్యిపోయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకొంటోంది. గామి సినిమాలో విశ్వక్ సేన్‌ అఘోరగా కనిపించనున్నాడు. చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మరోసినిమా 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'లో మాస్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు విశ్వక్‌సేన్. దీంట్లో అంజలి, నేహాశెట్టి హీరోయినట్లు కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకుంది.

Next Story