ఎస్టీలపై వ్యాఖ్యలు.. విజయ్ దేవరకొండ పశ్చాత్తాపం
హీరో సూర్య 'రెట్రో' ఆడియో లాంచ్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
By అంజి
ఎస్టీలపై వ్యాఖ్యలు.. విజయ్ దేవరకొండ పశ్చాత్తాపం
హీరో సూర్య 'రెట్రో' ఆడియో లాంచ్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. వాటిపై ఆయన వివరణ ఇచ్చారు. 'నాకు ఎస్టీలు అంటే అపారమైన గౌరవం ఉంది. వారిని అవమానించాలన్నది నా ఉద్దేశం కానే కాదు. వందలాది ఏళ్ల క్రితం మనుషులు తెగలుగా విడిపోయినప్పటి గురించి అలా మాట్లాడాను. కానీ అది జనాల్లోకి తప్పుగా వెళ్లింది. ఆ వ్యాఖ్యలపై పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాను' అని తెలిపాను.
ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని అన్నారు. భారత్‌లోని ప్రజలందరినీ ఒక్కటేనని భావిస్తానని అన్నారు. మనం కలిసికట్టుగా ముందుకుసాగాలని, ఐక్యంగా నిలబడాలన్నారు. తాను ఏ వర్గంపైనా ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదన్నారు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
అంతకుముందు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై మన్యం జిల్లా ఆదివాసీ నాయకులు మండిపడ్డారు. పాక్ గురించి మాట్లాడుతూ ట్రైబల్స్ లాగా కొట్టుకోవడం ఏంటని విజయ్ కామెంట్స్ చేయడం దారుణం అన్నారు. గిరిజనుల చరిత్ర తెలిసినట్టు హేళన చేస్తూ మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఉపన్యాసాలు ఇచ్చే ముందు వారి స్థితిగతులు తెలుసుకోవాలన్నారు.