పునీత్ స‌మాధి వ‌ద్ద కంట‌త‌డి పెట్టుకున్న హీరో సూర్య‌

Hero Surya Sheds Tears At The Tomb Of Puneeth Rajkumar.క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 3:19 PM IST
పునీత్ స‌మాధి వ‌ద్ద కంట‌త‌డి పెట్టుకున్న హీరో సూర్య‌

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోస్‌లో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర సీమ‌కు చెందిన న‌టీన‌టుల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, అశేష అభిమానులు పాల్గొన్నారు. అప్పు ఈ లోకాన్ని విడిచి ఏడు రోజులు కావ‌స్తున్న‌ప్ప‌టికి ఇంకా ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక అప్పు అంత్యక్రియలకు రాలేని నటీనటులంతా స్వయంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.ఇప్ప‌టికే హీరో నాగార్జున‌, మెగా హీరో రామ్‌ చరణ్‌లతో పాటు పలువురు నటులు బెంగళూరులోని ఆయన నివాసానికి వచ్చి పునీత్‌కు నివాళులర్పిస్తున్నారు.

పలు కారణాల చేత అంత్యక్రియలకు రాలేకపోయిన హీరో సూర్య కూడా శుక్రవారం వచ్చి ఆయనకు నివాళులర్పించారు. కంఠీరవ స్టూడియోస్ లోని పునీత్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య క‌న్నీటీ ప‌ర్యంతం అయ్యారు. అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కాలేక‌పోయినందుకు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. సూర్య వెంట పునీత్ సోద‌రుడు శివ‌రాజ్ కుమార్ కూడా ఉన్నారు.

వెండితెరపై మాత్రమే కాదు నిజ జీవితంలోనూ పునీత్ రాజ్ కుమార్ హీరోనే. 1800 మంది చిన్నారులను చదివిస్తున్నారు. ఇంకా ఎంతోమందికి చేయూతను అందిస్తూ సాయం చేస్తున్నారు. ఆయన మరణవార్త విని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకోగా.. ఓ యాంక‌ర్ ఆయ‌న మ‌ర‌ణ‌వార్త చ‌దువుతూ లైవ్‌లోనే ఏడ్చేసింది. మ‌ర‌ణానంత‌రం కూడా త‌న క‌ళ్ల‌ను దానం నలుగురికి చూపు ప్రసాదించిన గొప్ప మనిషి పునీత్ రాజ్‌కుమార్‌.

Next Story