ఆస‌క్తి రేకెత్తిస్తున్న సూర్య‌ 'అచలుడు' టైటిల్

Hero Suriya 41 movie title look viral. తన అవుట్‌స్టాండింగ్‌ ఫర్ఫామ్మెన్స్‌తో విమర్శకులను సైతం మెప్పించే నటుడు సూర్య. అలాగే నాచ్యురాలిటీకి దగ్గర, రియలిస్టిక్‌గా

By అంజి
Published on : 12 July 2022 10:25 AM IST

ఆస‌క్తి రేకెత్తిస్తున్న సూర్య‌ అచలుడు టైటిల్

తన అవుట్‌స్టాండింగ్‌ ఫర్ఫామ్మెన్స్‌తో విమర్శకులను సైతం మెప్పించే నటుడు సూర్య. అలాగే నాచ్యురాలిటీకి దగ్గర, రియలిస్టిక్‌గా ఉండే చిత్రాలను తీసే దర్శకుల్లో బాలా ఒకడు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తోందంటే సినీ లవర్స్‌కు పండగే. ఇదివరకు వీరి కాంబోలో వచ్చిన నంద, శివపుత్రుడు సినిమాలు కమర్షియల్‌గా భారీ సక్సెస్ కాలేకపోయాయి. కానీ విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు సూర్య, బాల కెరీర్‌లో ఎప్పటికే గుర్తుండిపోయేవిగా నిలిచాయి. ఇప్పడు తాజాగా, అంటే 18 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వీరి కాంబో ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పటి నుంచి ఆడియన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

తాజాగా బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 41వ సినిమా టైటిట్‌ లుక్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్ చేసింది. ఈ మూవీ టైటిల్‌ను 'అచలుడు'గా ఖరారు చేస్తూ సూర్య లుక్‌ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో రగ్గుడ్‌ లుక్‌లో మీసానికి గాటు పెట్టుకుని ఇంటెన్సీవ్‌ కళ్లతో సూర్య చూస్తున్నాడు. ఈ పోస్టర్‌ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. ఈ మూవీలో సూర్య మూగవాడిగా, చెవిటివాడిగా నటించనున్నట్లు టాక్. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని సూర్య త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సొంతంగా నిర్మిస్తున్నాడు.


Next Story