సిద్ధార్థ్ సినిమా విడుదల వాయిదా

హీరో సిద్దార్థ్ కు హిట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. అతడు హీరోగా నటిస్తోన్న చిత్రం టక్కర్. రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో

By M.S.R  Published on  19 May 2023 8:15 PM IST
takkar, Hero Siddharth, Tollywood

సిద్ధార్థ్ సినిమా విడుదల వాయిదా

హీరో సిద్దార్థ్ కు హిట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. అతడు హీరోగా నటిస్తోన్న చిత్రం టక్కర్. రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీకి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 26న ప్రేక్ష కుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల తేదీని వాయిదా వేసినట్టు తెలియజేసింది చిత్ర బృందం. జూన్‌ 9న టక్కర్‌ థియేటర్లలో విడుదల కాబోతోందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై సుధాన్‌ సుందరం, జీ జయరామ్‌, టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నివాస్‌ కే ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో యోగిబాబు, అభిమన్యు సింగ్‌, మునిష్‌కాంత్‌, విఘ్నేశ్‌ కాంత్‌, రామ్‌దాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ లో మహాసముద్రం సినిమాతో సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత కనిపించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Next Story