హీరో సిద్ధార్థకు ఘోర అవమానం.. వీడియో వైరల్

హీరో సిద్ధార్థకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనగా ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

By Srikanth Gundamalla
Published on : 29 Sept 2023 8:14 AM IST

Hero Siddharth, insulted, bangalore, press meet, viral video,

హీరో సిద్ధార్థకు ఘోర అవమానం.. వీడియో వైరల్

హీరో సిద్దార్థ్‌కు కోలీవుడ్‌లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్స్‌ ఉన్నారు. కోలీవుడ్‌ తర్వాత తెలుగులో కూడా ఆయన సినిమాలకు మంచి కలెక్షన్లు లభిస్తాయి. అయితే.. హీరో సిద్ధార్థకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనగా ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అంతేకాదు.. అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హీరో సిద్ధార్త్ 'చిత్తా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులోని ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. అయితే.. ఈ విలేకర్ల సమావేశాన్ని కావేరీ జలాల పోరాట సమితీ సభ్యులు అడ్డుకున్నారు. తమిళోడివి నీకు కార్ణాటకలో ఏం పని అంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. ఆందోళనకు కూడా దిగారు. హీరో సిద్ధార్థకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అలాగే వెంటనే ప్రెస్‌మీట్‌ను నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. నిరసనకారుల ఆందోళనలు ఎంతసేపటికీ ఆపకపోవడంతో.. కాసేపు మౌనంగానే ఉన్న హీరో సిద్ధార్థ్‌ చివరకు చేసేది ఏం లేక వేదిక పైనుంచి వెళ్లిపోయారు. ఆయన ఏమీ మాట్లాడకుండా నిరసనలకు తలొగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు కొందరు సిద్ధార్థకు మద్దతు తెలుపుతున్నారు. సినిమాను ప్రమోట్‌ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. హీరోను అవమానించి బలవంతంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించకుండా అడ్డుకోవడం ఏ మాత్రం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సిద్ధార్థ చిత్తా సినిమాలో లీడ్‌రోల్‌లో నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని సిద్ధార్థ తన సొంత బ్యానర్‌ ఎతకీ ఎంటర్‌టైన్మెంట్‌పై నిర్మించారు. ఎస్‌.యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ సరసన హీరోయిన్‌గా మలయాళ నటి నిమిషా సాజయన్ నటించింది. కాగా.. ఈ సినిమా గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులో కూడా సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ కావాల్సి ఉన్నా.. ఇక్కడ పెద్ద సినిమాలు విడుదల ఉండటంతో అక్టోబర్ 6కి వాయిదా వేశారు మేకర్స్.

Next Story