వయసుపై సెటైర్స్.. 'ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు.. దరిద్రం' అంటూ సిద్ధార్ద్ ట్వీట్
Hero Siddharth fires on Netizen.'బొమ్మరిల్లు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సిద్ధార్థ్.
By తోట వంశీ కుమార్ Published on 17 July 2021 11:15 AM IST'బొమ్మరిల్లు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సిద్ధార్థ్. అయితే.. తరువాతి కాలంలో సరైన హిట్లు లేకపోవడంతో అతను తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయ్యాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత తాజాగా మహా సముద్రం చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా సముద్రం చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఇప్పటికే సిద్ధార్థ్ లుక్ విడుదల కాగా, ఈ లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. తనకు నచ్చని అంశాలపై ముక్కుసూటిగా చెబుతూ అతను తరచూ ఏదో ఒక సంచలనం సృష్టించాడు. తాజాగా అతను మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప చిత్రం నుంచి ఇటీవల ఒక పాటను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్‌కు జోడీగా అమ్ము అభిరామి నటించింది. ఇందులో వయస్సు తక్కువ ఉన్న అమ్మాయితో వెంకీ రొమాన్స్ చేయడం పట్ల ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం అది కేవలం సినిమా కోసమేనని.. నిజానికి ఈ విషయంపై ట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.
Ee hero vayasu topic lo neeku firstu nene gurthochana ra? Tag kuda chesav? Super ra daridram.
— Siddharth (@Actor_Siddharth) July 16, 2021
Ekkadninchi ostharraa meelantollu? 🥲#Telugu #Daranam #NaaVayasuNaakuTelusu https://t.co/yjTFpzCMsI
అయితే. ఓ నెటిజన్ ..'40 ఏళ్లు పైబడిన సిద్ధార్థ్ తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ' సిద్ధార్థ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు. 'ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?' అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.
Cha! Athanu naa adopted son. Nenu Mohan Babu garu classmates. Please get your facts straight.#Sodhi #Arachakam #ParisthithuluPrabhavam https://t.co/9W2y0NUCoK
— Siddharth (@Actor_Siddharth) July 16, 2021
మరో నెటిజన్.. 'నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా' అంటూ ట్వీట్ చేశాడు. 'ఛా! అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్‌మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో' అంటూ సిద్ధార్థ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. వాటికి 'సోది, అరాచకం, పరిస్థితుల ప్రభావం, దారుణం, నా వయస్సు నాకు తెలుసు' అనే హ్యాష్‌ట్యాగులను జత చేశారు.