అబ్దుల్‌ ఫర్హాన్‌ గురించి వస్తున్న వదంతులపై స్పందించిన సాయిధరమ్‌ తేజ్‌

తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు. రోడ్డుపై పడి ఉన్న సాయి ధరమ్ తేజ్ ను సకాలంలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 April 2023 5:45 PM IST
Hero Saidharam Tej , Abdul Farhan, Tollywood news

అబ్దుల్‌ ఫర్హాన్‌ గురించి వస్తున్న వదంతులపై స్పందించిన సాయిధరమ్‌ తేజ్‌

తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు. రోడ్డుపై పడి ఉన్న సాయి ధరమ్ తేజ్ ను సకాలంలో ఆస్పత్రికి తరలించిన అబ్దుల్‌ ఫర్హాన్‌కు తేజ్‌ ఎలాంటి సాయం చేయలేదని, కనీసం ఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వలేదని అబ్దుల్‌ చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. 'విరూపాక్ష’ విడుదల సందర్భంగా తేజ్‌ మాట్లాడుతూ.. పునర్జన్మను ఇచ్చిన అతనికి ఓ లక్ష ఇచ్చి చేతులు దులిపేసుకోవాలనుకోవడం లేదనీ, అసలు అతనికి ఎలాంటి రివార్డు ఇవ్వలేదని తేజ్‌ అన్నారు. మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సాయం చేసి ఉంటే ఆ విషయం నాకు తెలీదు. దాని గురించి నేను ఎవరిని అడగలేదని చెప్పారు. అబ్దుల్‌కి ఏ సాయం కావలసినా నేరుగా ఫోన్‌ చేసి అడగొచ్చని ఆ రోజు మా వాళ్లు అబ్దుల్‌కు చెప్పారని అప్పట్లో అన్నాడు.

ఇక తాజాగా వస్తున్న వదంతులపై సాయిధరమ్‌ తేజ్‌ మరోసారి స్పందించారు. ‘నాపై, నా టీమ్‌పై దుష్ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఇటీవల నేను ఇంటర్వ్లూలో చెప్పినట్లు నేను కానీ, నా టీమ్‌ కానీ అబ్దుల్‌కి ఎలాంటి రివార్డ్‌ ఇవ్వలేదు. అందుకు కారణం.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకోవడం లేదు. అతను చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అతనికి ఏ సాయం కావాలన్న కోరమని నాది, మా మేనేజర్‌ నంబర్స్‌ ఇచ్చాం. అతను ఎప్పుడు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.' అని సాయిధరమ్‌ తేజ్‌ చెప్పుకొచ్చారు.

Next Story