రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోన్న రవితేజ 'ఈగల్' మూవీ
మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా 'ఈగల్'.
By Srikanth Gundamalla Published on 1 March 2024 8:00 AM ISTరెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోన్న రవితేజ 'ఈగల్' మూవీ
మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా 'ఈగల్'. ఈ మూవీకి సినిమాటో గ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. బాగుందంటూ కొందరు చెబితే.. యావరేజ్ అంటే ఇంకొందరు కామెంట్ చేశారు. మిక్స్‌డ్‌టాక్ రావడంతో కొందరు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపలేదు. వారికి ఇదే గుడ్‌న్యూస్. రవితేజ ఈగల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఓటీటీ వేదికల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈటీవీ విన్, ప్రైమ్ వీడియోల్లో ఈగల్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే.. ఈ సినిమా హిందీలో సహదేవ్ టైటిల్‌తో థియేటర్లలో విడులైంది. కానీ..ప్రస్తుతానికి హిందీ వెర్షన్ ఓటీటీలో విడుదల కాలేదు. దీనికి సంబంధించిన విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈగల్ మూవీలో రవితేజ సరసన హీరోయిన్‌గా కావ్య థాపర్ నటించింది. అనుపమ పరమేశ్వర్ కీలక పాత్రలో మెరిసింది. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల వంటి నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ మూవీని తెరకెక్కించారు. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో ఈగల్ మూవీని మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
మరోవైపు ఈగల్ మూవీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు. అంతేకాదు.. సీక్వెల్‌కు ఈగల్.. యుద్ధకాండ టైటిల్‌ను కూడా ఫైనల్ చేశామని ప్రకటించారు.