ప్రమోషన్స్ లేవు.. 'ఈగల్' కలెక్షన్స్ కు భారీ దెబ్బ

రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా ఈ వారం విడుదల అయింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Feb 2024 9:15 PM IST
ravi teja, movie, eagle, collections,

ప్రమోషన్స్ లేవు.. 'ఈగల్' కలెక్షన్స్ కు భారీ దెబ్బ

రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా ఈ వారం విడుదల అయింది. మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా అంటే ఎలా ఉండాలి హైప్.. కానీ అలాంటిదేమీ లేదు. కనీసం చిత్ర యూనిట్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రమోట్ చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. సినిమా బోర్ కొట్టకుండా ముందుకు బాగా నడిపించాడు చిత్ర దర్శకుడు.. అలాంటిది వీకెండ్ దాటాక సినిమాను చూసే వాళ్లు లేకుండా పోయారు. సోమవారం మంగళవారం థియేటర్లలో చాలా తక్కువ మంది ఈగల్ సినిమాను చూస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ఈ సినిమా వచ్చిందనే కూడా తెలియడం లేదు. మెట్రో నగరాల్లో సినిమా నైట్ షోలకు పర్వాలేదనే విధంగా జనం వస్తున్నా.. మిగిలిన ప్రాంతాలలో కనీసం ఫుట్ ఫాల్స్ కనిపించడం లేదు.

ఈగల్ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకుల నుండి పర్వాలేదనే స్పందన వచ్చింది.. తక్కువ బజ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ నంబర్లను సొంతం చేసుకుంది. అయితే సోమవారం ఫుట్‌ఫాల్స్‌లో భారీ తగ్గుదల కనిపించింది. ఇది సినిమా ఫెయిల్యూర్ కు కారణం అయ్యే అవకాశం ఉంది. రవితేజ ఈ సినిమాలో మంచి ప్రదర్శన చేసినా.. క్లైమాక్స్ బాగా కుదిరినా.. బలహీనమైన ప్రమోషన్‌లు, మిక్స్‌డ్ మౌత్ టాక్ సినిమాపై భారీ ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ వీకెండ్ లో కొత్త సినిమాల రాక ఉండడం.. పలు సినిమాల రీ రిలీజ్ లు ఉండడంతో ఈగల్ సినిమా ఈ వారం ఎలాంటి నంబర్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Next Story