హీరో రామ్ ఇంట విషాదం
Hero Ram Pothineni grand father passed away.ఎనర్జిటిక్ స్టార్ రామ్‌పోతినేని ఇంట విషాదం నెలకొంది. రామ్ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on
18 May 2021 6:41 AM GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌పోతినేని ఇంట విషాదం నెలకొంది. రామ్ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్.. ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కుటుంబం కోసం తాతయ్య ఎంతో శ్రమించారని రామ్ తెలిపారు.
ఓ లారీ డ్రైవర్‌గా విజయవాడలో ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబ సభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆ రోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవారు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న నగదుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనసు వల్లే ప్రతి ఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి కలగాలి తాతయ్య అని రామ్ ట్వీట్ చేశారు.
Next Story