ఆదిపురుష్ టీజర్‌ను 3డీలో చూసి థ్రిల్ అయ్యాను : ప్రభాస్
Hero Prabhas Speech at ADIPURUSH 3D Teaser Launch.యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్.
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2022 12:07 PM ISTయంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామాయణ ఇతిహాసం ఇతివృత్తం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతిససన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే కొందరు మాత్రం ఈ టీజర్‌పై నెగెటివ్ కామెంట్స్ చేశారు.
ఇవేవీ పట్టించుకుని చిత్ర బృందం గురువారం ఆదిపురుష్ 3D టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ టీజర్‌ను 3డీ లో చూసినప్పుడు తాను చిన్నపిల్లాడిని అయిపోయినట్లు చెప్పాడు. 3డీ ఫార్మాట్‌లో తాను కనిపించడం గొప్పగా అనిపించిందని, ఎంతో థ్రిల్‌గా ఫీల్ అయినట్లు తెలిపాడు. ఇండియాలో ఇప్పటి వరకు వాడని టెక్నాలజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పాడు. ఈ సినిమాను ఎంతో కష్టపడి తీశామని, అందరికీ నచ్చే విధంగా ఉండనుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు మాట్లాడుతూ.. బిగ్ స్క్రీన్ ఫిలింస్ టీజర్లను సెల్‌ఫోన్లలో అంచనా వేయలేమన్నారు. వీఎఫ్ఎక్స్ సినిమాలను థియేటర్లలోనే చూడాలని అప్పుడే ఆ సినిమా ఏంటో అర్థం అవుతుందన్నారు. 'ఆదిపురుష్' కూడా అలాంటి సినిమానేనని చెప్పారు. తొలుత టీజర్‌ని ఫోన్‌లో చూశా. తరువాత పెద్ద స్క్రీన్‌పై చూశా. ఇప్పుడు 3డీలో చూశాను. టీజర్ చూసి విజిల్స్ వేసినట్లు చెప్పారు.