ప్ర‌భాస్ అభిమాని సూసైడ్ నోట్ వైర‌ల్‌.. నా చావుకు కారణం

Hero Prabhas Fan Suicide Letter goes viral.బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయాడు రెబ‌ర్ స్టార్ ప్ర‌భాస్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 5:23 AM GMT
ప్ర‌భాస్ అభిమాని సూసైడ్ నోట్ వైర‌ల్‌.. నా చావుకు కారణం

బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయాడు రెబ‌ర్ స్టార్ ప్ర‌భాస్. బాహుబ‌లి త‌రువాత‌ కాస్త విరామం తీసుకున్న డార్లింగ్.. సాహోతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం విడుద‌లై రెండేళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో చిత్రం విడుద‌ల కాలేదు. ఇక లాక్‌డౌన్ అనంత‌రం ప్ర‌భాస్‌ సినిమాల్లో జోరు పెంచాడు. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్', నాగ్ అశ్విన్ సినిమా, 'స్పిరిట్' వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ వ‌రుస‌గా చిత్రాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికి.. ఆయ‌న న‌టించే చిత్రాల అప్‌డేట్స్ రావ‌డం లేద‌ని ప్ర‌భాస్ అభిమానులు కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఓఅభిమాని రాధే శ్యామ్ చిత్ర యూనిట్‌కు రాసిన లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 'రాధే శ్యామ్' అప్ డేట్స్ ఇవ్వ‌డం లేదని సూసైడ్ నోట్ రాశాడు. లేఖ‌లో ఏముందంటే.. "సార్‌.. ఇంతవరకు ఒక్క‌ లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజుల నుంచి వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్" అంటూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమాని తన ఆవేదనను తెలిపాడు. అంతేకాదు త‌న‌చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమేన‌ని.. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ లేఖ‌లో పేర్కొన్నాడు.

కాగా.. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చిత్రం అప్‌డేట్స్ కోసం ప్రాణాలు తీసుకోవ‌డం ఏంటీ.. కాస్త ఆలోచించండి అంటూ ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. అభిమానం ఉండాలి గానీ.. ప్రాణాలు తీసుకోవ‌ద్దు అని స్టార్ హీరోలంద‌రూ చెబుతున్నా కొంద‌రు అభిమానులు మాత్రం వారి మాట‌ల‌ను కూడా విన‌డం లేదు. ఇక 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it