సలార్ రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుంది: ప్రభాస్
ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ 'సలార్' థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. క
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 1:15 PM ISTసలార్ రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుంది: ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ 'సలార్' థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. కలెక్షన్లలో రికార్డులను తిరగరాస్తోంది. బాక్సీఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచిన ఈ మూవీ.. ప్రభాస్ కెరియర్‌లోనే అతిపెద్ద విజయవంతమైన మూవీల జాబితాలో చేరింది. అయితే.. ఈ సినిమా గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'సలార్' సినిమా కథ తనకెంతో నచ్చిందని ప్రభాస్ అన్నారు. ఈ స్టోరీ వినగానే వెంటనే ఓకే చేశాననీ అన్నారు. తన కెరీర్‌లో చేసిన భిన్నమైన పాత్రల్లో సలార్ మూవీలో ఉన్న క్యారెక్టర్ ఒకటి అని చెప్పుకొచ్చారు. ఈ క్యారెక్టర్ చేయడం తనకెంతో సవాల్‌గా అనిపించిందని చెప్పారు. 'బాహుబలి' సినిమా తన కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసిందనీ.. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నట్లు ప్రభాస్ వెల్లడించారు. అందులో భాగంగానే సలార్ సినిమాకు కూడా ఒకే చెప్పానని వెల్లడించారు. సినిమా ప్రేక్షకులు కూడా కొత్త కంటెంటె్‌ను ఇష్టపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటున్నాయని ప్రభాస్ అన్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తిస్తున్నారని ప్రభాస్ అన్నారు.
ఎస్‌ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పనిచేయడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ప్రభాస్ అన్నారు. సలార్ పార్ట్-1 చివరిలోనే రెండో భాగం ఉంటుందని స్పష్టం చేశామనీ.. మొదటి పార్ట్‌తో పోలిస్తే సలార్ రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ అన్నారు. కాగా.. సలార్ ఫస్ట్‌పార్ట్‌లో ఉన్న యాక్షన్ సీన్స్.. డైలాగ్స్ ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలివేషన్స్‌కు అయితే ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గర సీన్లు ఉన్నాయంటూ చెబుతున్నారు. ప్రసన్తుతం ప్రభాస్ మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), సందీప్ వంగా తో ‘స్పిరిట్’లో నటిస్తున్నారు.