'కార్తికేయ 2' షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్ కి గాయాలు..!

Hero Nikhil Siddharth Got Injured im Karthikeya 2 Movie Shooting.హీరో నిఖిల్‌ ఓ మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడనే వార్త వైరల్ అవుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2021 6:33 PM IST
Hero Nikhil Siddharth Got Injured im Karthikeya 2 Movie Shooting

ఎన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌ట‌కి సినిమా షూటింగ్‌ల‌లో హీరోలకు గాయాలు అవుతుంటాయి. ఆ మ‌ధ్య అయితే ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా యంగ్ హీరోలంద‌రికి గాయాల‌య్యాయి. సందీప్ కిషన్, శర్వానంద్, సుధీర్ బాబులకు కూడా సినిమా షూటింగ్‌లలో గాయాలయ్యాయి. తాజాగా హీరో నిఖిల్‌ ఓ మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడనే వార్త వైరల్ అవుతోంది. హీరో నిఖిల్‌, విలక్షణ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'కార్తికేయ 2'. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా రీసెంట్‌గా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీక‌రిస్తుండ‌గా..నిఖిల్ కాలికి గాయమైంది. దీంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. హీరో నిఖిల్‌ ఆరోగ్యం విషయంలో అభిమానులెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆయనకి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని.. ప్రస్తుతం ఆయన చక్కగానే ఉన్నారని చిత్రయూనిట్‌ వర్గాలు తెలుపుతున్నాయి. నిఖిల్‌, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ' చిత్రం ఎటువంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రూపొందుతోంది.




Next Story