న‌జ్రియాతో క‌లిసి స్టెప్పులేసిన నాని భార్య‌.. వీడియో వైర‌ల్‌

Hero Nani Wife Anjana dance with Nazriya Fahadh goes viral.నాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం అంటే సుంద‌రానికీ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 11:55 AM IST
న‌జ్రియాతో క‌లిసి స్టెప్పులేసిన నాని భార్య‌.. వీడియో వైర‌ల్‌

నాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం 'అంటే సుంద‌రానికీ'. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న న‌జ్రియా న‌టించింది. వేర్వేరు మ‌తాల‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రేమ‌లో ప‌డిన త‌రువాత త‌మ పెళ్లికి పెద్ద‌ల‌ను ఒప్పించ‌డానికి ప‌డిన‌పాట్ల‌ను ఫ‌న్నీగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు(జూన్ 10) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది చిత్ర బృందం. తాజాగా ఈ చిత్ర సాంగ్ ప్రొమోను విడుద‌ల చేసింది. ఇందులో నజ్రియా, నాని భార్య అంజ‌న‌తో క‌లిసి సెప్టులేసింది. చివ‌ర్లో నాని వీరితో క‌లిసి డ్యాన్స్ చేశాడు. ఈ సాంగ్ ప్రొమోను షేర్ చేసిన న‌జ్రియా.. నాని, అంజ‌నల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story