బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు : నాని

Hero Nani tweets on Singarini coloney incident.సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జ‌రిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2021 12:21 PM IST
బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు : నాని

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జ‌రిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌పై ప్ర‌జ‌లతో పాటు సినీ ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు. చిన్నారిని క్రూరంగా హ‌త్యాచారం చేసిన నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై మంచు మనోజ్, మహేష్, నాని వంటి సెలెబ్రిటీలు సైతం తమ గళం వినిపిస్తున్నారు. తెలంగాణ పోలీస్ ట్వీట్‌ని షేర్ చేస్తూ.. బ‌య‌టెక్క‌డో ఉన్నాడు, ఉండ‌కూడ‌దు అని నాని ట్వీట్ చేశాడు.

ఇక నిందితుడు రాజు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆచూకీ ఇంత‌వ‌ర‌కు తెలియ‌క‌పోవ‌డంతో నిందితుడి ఆచూకీ తెలిపిన రూ.10ల‌క్ష‌ల రివార్డు అందిస్తామ‌ని నిన్న పోలీసులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అత‌డి ఫోటోను విడుద‌ల చేయ‌డంతో పాటు అత‌డికి సంబంధించిన గుర్తుల‌ను సైతం వాంటెడ్ నోట్‌లో స్ప‌ష్టంగా వెల్ల‌డించారు. పది బృందాలు.. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు కొన‌సాగిస్తున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలానికి చెందిన పల్లకొండ రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. సైదాబాద్ ఏరియాలో చుట్టుపక్కల వారితోనూ నిందితుడు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి దారుణానికి ఒడిగ‌ట్టాడు.

Next Story